అట్లెటికో మాడ్రిడ్‌తో జరిగిన ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లో 2-0తో ఓటమి పాలైన తర్వాత, మాంచెస్టర్ యునైటెడ్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ క్లబ్ ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జట్టును బలోపేతం చేయడానికి తగినంత పెట్టుబడులు పెట్టడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మార్టినెజ్ మాట్లాడుతూ, మా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ కొన్నిసార్లు మైదానంలో జరిగేది మన క్లబ్ ప్రస్తుతం ఎలా ఉందో ప్రతిబింబిస్తుంది అని అన్నారు. కోచ్‌ను లేదా ఆటగాళ్లను మాత్రమే తప్పుపట్టడం సరిపోదని, క్లబ్‌లోని ఇతర విభాగాల బాధ్యతను కూడా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టెక్నికల్ డైరెక్టర్‌పై అసంతృప్తి
క్లబ్ టెక్నికల్ డైరెక్టర్ జేసన్ విల్కాక్స్ నుంచి మరింత మద్దతు ఆశిస్తున్నానని మార్టినెజ్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లో, నేను ఇంకా ఎక్కువ పెట్టుబడులను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా 100 శాతం. మా టెక్నికల్ డైరెక్టర్ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇదే నా అభిప్రాయం. ఆటగాళ్లుగా మేము కూడా ఇంకా మెరుగ్గా ఆడాలి. అయితే ఇలాంటి పెద్ద మ్యాచ్‌లను ఎదుర్కొనేందుకు బలమైన జట్టును నిర్మించడం కూడా ముఖ్యం అని అన్నారు. గత సీజన్లో తాము ఒక మంచి జట్టును నిర్మించేందుకు పునాది వేశామని, ఆ పునాదిపై మరింత అభివృద్ధి జరగాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.











