భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రంజీ ట్రోఫీలో తీవ్ర నిరాశ ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు ముందు రెడ్‌బాల్ క్రికెట్లో ప్రాక్టీస్ కోసం బరిలోకి దిగిన గిల్.. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అతడు ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
మ్యాచ్ వివరాల ప్రకారం, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 202627 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 5 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. ఛత్తీస్‌గఢ్ ఎడమచేతి స్పిన్నర్ అజయ్ మండల్ వేసిన బంతి గిల్ డిఫెన్స్‌ను ఛేదించి వికెట్లను పడగొట్టింది. దీంతో గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గిల్ వికెట్ కోల్పోయే సమయానికి పంజాబ్ జట్టు 68 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. అంతర్జాతీయ స్థాయి బ్యాటర్ అయిన శుభ్‌మన్ గిల్ దేశవాళీ క్రికెట్లో స్పిన్నర్ బౌలింగ్‌లో తక్కువ స్కోరుకే ఔటవడంతో అభిమానులు అతడి బ్యాటింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.










