బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహీకి సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన భారీ వసూళ్ల కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఆమెను ప్రాసిక్యూషన్ తరఫు సాక్షిగా విచారించనున్నారు. ఆమె కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన వసూళ్ల కేసులో పోలీసులు దాఖలు చేసిన మూడో అనుబంధ ఛార్జ్‌షీట్‌లో నోరా ఫతేహీ పేరును సాక్షిగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రూ.200 కోట్ల వసూళ్ల కేసు ఏమిటి
ఈ కేసు ప్రధానంగా మాజీ ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రభుత్వ ఉన్నతాధికారిగా నటిస్తూ, తన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి సుమారు రూ.200 కోట్లు వసూలు చేసినట్లు ఆమె ఆరోపించారు.











