సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు తమ ప్రస్థానాన్ని విజయంతో ముగించింది. పుణెలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పుదుచ్చేరి జట్టుపై హైదరాబాద్ విజయం సాధించింది. ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా, రెండింటిలో గెలిచి, నాలుగింటిలో ఓటమి పాలైంది.
గ్రూప్-డిలో ఏడు జట్లలో ఐదో స్థానంలో నిలిచింది. అంతకుముందు జార్ఖండ్ జట్టుపై కూడా హైదరాబాద్ విజయం సాధించింది. జట్టు కెప్టెన్ ప్రణవి చంద్ర ఆధ్వర్యంలో యువ క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











