భారత టీ20 జట్టు కెప్టెన్సీ ఎంపికపై మాజీ సెలెక్టర్ ఎస్. శరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం సాహసోపేత నిర్ణయమని, దీనికి అప్పటి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు క్రెడిట్ దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం సాహసోపేత నిర్ణయమని మాజీ సెలెక్టర్ ఎస్. శరత్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న అప్పటి భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఆ క్రెడిట్ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హార్దిక్ పాండ్యా కంటే సూర్యకుమార్ వైపే ఎందుకు మొగ్గు
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కెప్టెన్సీ ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తదుపరి కెప్టెన్ అవుతారని చాలామంది భావించారు. అయితే సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించారు.












