కామారెడ్డి, 2026-10-28
కామారెడ్డి జిల్లాలో 2027లో జరగనున్న జనాభా గణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జనాభా గణన నిర్వహణపై తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో జనాభా గణన 2027 ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. జనాభా గణన నిర్వహణకు సంబంధించి తహసీల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.












