కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని జోన్-1 లోని 9 వార్డుల్లో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ స్పందించారు. గడి వాటర్ ట్యాంక్ మోటార్ల మరమ్మతుల్లో అలసత్వం వహించిన అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి పట్టణంలోని జోన్-1 లోని 25, 26, 27, 28, 30, 44, 45, 46, 47 వార్డుల్లో గత కొన్ని రోజులుగా గడి వాటర్ ట్యాంక్ మోటార్లు పాడైపోవడం వల్ల తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తాగునీరు ప్రజల ప్రాథమిక అవసరమని, మోటార్లు కాలిపోయిన విషయాన్ని అధికారులు వెంటనే పట్టించుకోకపోవడం, మరమ్మతుల్లో అలసత్వం వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్య తీవ్రతను పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.











