కామారెడ్డి, 2026-08-05
జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా, పండుగ వాతావరణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.

ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఆగస్టు 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, అతిథుల సీటింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జిల్లా ప్రగతి నివేదిక సిద్ధం చేయాలి