పరిష్కరించాలని (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 07
కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన 58 ఫిర్యాదులు, వినతులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే జిల్లా అధికారులను అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. ప్రజల సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ఆదేశం కామారెడ్డి, సెప్టెంబర్ 7: ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులు, వినతులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే జిల్లా అధికారులను అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల నుంచి మొత్తం 58 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, ప్రతి దరఖాస్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పరిష్కరించగల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించడంతో పాటు, ఇతర శాఖల సమన్వయం అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజావాణిని ఆశ్రయిస్తున్నందున, వారి వినతులపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ విక్టర్ స్పష్టం చేశారు. అలాగే ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, సీఈఓ చందర్, ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ, డీఆర్వో పాండు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.












