కామారెడ్డి, 2026-08-03
జిల్లా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, అనవసర ప్రయాణాల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని మండల, డివిజన్ స్థాయిల్లోనూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నిర్ణయించారు. వచ్చే వారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ప్రజల సౌకర్యార్థం, ఇబ్బందులు తగ్గించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు ప్రతి సోమవారం జిల్లాలోని డివిజన్, మండల స్థాయిల్లోనూ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. వచ్చే వారం నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజన్ స్థాయిల్లోనూ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.












