పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని, పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు. బాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పరేడ్ మైదానంలో శనివారం 521 మంది నూతన కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది.
ఈ పరేడ్‌లో కడప పీటీసీలో శిక్షణ పొందిన 194 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 327 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత గౌరవ వందనం స్వీకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం మాట్లాడుతూ పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని, దీక్షాంత్ పరేడ్ శిక్షణార్థి నుంచి బాధ్యతాయుత పోలీసుగా మారే కీలక ఘట్టమని అన్నారు.












