క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. జిల్లాకు ఎంపికై ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 90 మంది ఎస్‌సీటీపీసీ కానిస్టేబుళ్లతో ఆయన సమావేశమయ్యారు. వీరిలో 28 మంది మహిళలు, 62 మంది పురుష కానిస్టేబుళ్లు ఉన్నారు.
జిల్లాకు ఎంపికై ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 90 మంది ఎస్‌సీటీపీసీ కానిస్టేబుళ్లతో డీపీఓ కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ సమావేశమయ్యారు. వీరిలో ఒంగోలులోని డీటీసీలో 28 మంది మహిళా కానిస్టేబుళ్లు, నెల్లూరులోని డీటీసీలో 62 మంది పురుష కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కొత్త సిబ్బంది పోలీస్ శాఖకు నూతన బలమని, ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వేలాది మందిలో కొద్దిమందికే ఖాకీ యూనిఫాం ధరించే అవకాశం లభిస్తుందని, నిస్వార్థంగా సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా గుర్తించాలన్నారు.












