భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ నెల 26, 27 తేదీల్లో తిరుపతి, తిరుమల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు భద్రతా తనిఖీ () సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ, ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారులు పాల్గొని భద్రత, ప్రోటోకాల్, రవాణా, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైద్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖలకు సూచనలు












