తెలంగాణలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్వహణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వివాదం తీవ్రతరమైంది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 14ను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా చలో కోకాపేట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
బీసీ సంఘాలకు కేటాయించిన భూములు, భవనాలపై ప్రభుత్వ నియంత్రణ తీసుకురావడం ఆయా సంఘాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. న కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 14 బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్వహణకు సంబంధించినది. ఈ ఉత్తర్వుల ద్వారా భవనాల నిర్వహణలో ప్రభుత్వ ప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత ప్రభుత్వ హయాంలో కేటాయింపులు
గతంలో బీసీ సంఘాల స్వయంప్రతిపత్తిని కాపాడేందుకు 2018లో జీవో 189 తీసుకొచ్చామని, భవనాల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.97.5 కోట్లు కేటాయించిందని మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు
శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్. మధుసూదనాచారి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తదితరులు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ప్రతినిధుల ఆధిపత్యంలో కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల బీసీ సంఘాల హక్కులు తగ్గుతాయని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కేటాయించిన భూములను విక్రయించే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేపీ వివేకానంద్ ఆరోపించారు.







