భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ భరత్పూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను జస్టిస్ సుదేశ్ బన్సల్ మరియు జస్టిస్ అనిల్ కుమార్ ఉపమన్లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. వైవాహిక జీవితంలో చిన్నపాటి హెచ్చుతగ్గులు సహజమని, విడాకులు మంజూరు చేయడం వల్ల కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది.
సుదీర్ఘ దాంపత్య జీవితం కలిగిన ఈ దంపతులకు 1967లో వివాహం జరిగింది. 2013 వరకు దాదాపు 46 ఏళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే, 2014లో భర్త విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తన భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసు అబద్ధమని పోలీసులు తేల్చారని, ఇది తనను అవమానానికి గురిచేసిందని భర్త తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆస్తి విభేదాలు, భార్య నిర్లక్ష్యం, అక్రమ సంబంధాల ఆరోపణలు కూడా ఆయన లేవనెత్తారు.












