కామారెడ్డి, 2026-08-06
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను ఆయన నెలవారీ తనిఖీలో భాగంగా సందర్శించారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను ఆయన నెలవారీ తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా గోదాంలో అమలవుతున్న భద్రతా ఏర్పాట్లు, ద్వంద్వ తాళాల విధానం, సీసీటీవీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాల అందుబాటు, సందర్శకుల నమోదు పుస్తకం, భద్రతా రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ ఆదేశాలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం గోదాంలో అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. గోదాంలో 24 గంటల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.












