చేయాలని (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 08
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసే గణేష్ మండపాల నిర్వాహకులు, మండపాలకు సంబంధించిన వివరాలను పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సూచించారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టేందుకు ఇది పోలీసులకు వీలవుతుందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గణేష్ మండపాల వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి: జిల్లా ఎస్పీ రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసే గణేష్ మండపాల నిర్వాహకులు మండపాలకు సంబంధించిన వివరాలను పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సూచించారు. మండపాల వివరాలను ముందస్తుగా నమోదు చేయడం ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టేందుకు పోలీసులకు వీలవుతుందని తెలిపారు. ఇందుకోసం http://policeportal.tspolice.gov.in వెబ్సైట్ ద్వారా కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గణేష్ మండపాలను ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాటు , సంబంధిత శాఖల అనుమతులు పొందిన తర్వాతే విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, వాలంటీర్లు, నిర్వాహకుల వివరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. మండపాలు, శోభాయాత్రల్లో డీజేలు, టపాసులు, మద్యం సేవించడం, జూదం, అసభ్యకర కార్యక్రమాలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే నినాదాలు, పాటలు, ఫ్లెక్సీలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతితో స్పీకర్లను వినియోగించాలని, భక్తిగీతాలు మాత్రమే ప్రసారం పేర్కొన్నారు. గణేష్ ప్రతిష్ఠాపన, నిమజ్జన శోభాయాత్రలను నిర్ణీత సమయాల్లో నిర్వహిస్తూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్–112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.












