కామారెడ్డి, 3 September
గాంధారి మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం జడ్పీ సీఈవో పరిశీలించారు. బుర్గుల్, కరక్‌వాడి, గాంధారి గ్రామపంచాయతీలను సందర్శించి, చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభివృద్ధి పనులను పరిశీలించిన జెడ్పీ సీఈవో గాంధారి: మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం జెడ్పీ సీఈవో పరిశీలించారు. బుర్గుల్, కరక్‌వాడి, గాంధారి గ్రామపంచాయతీలను సందర్శించిన ఆయన ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి, పారిశుధ్య పనుల పురోగతిని పరిశీలించారు. బుర్గుల్ గ్రామపంచాయతీలో ఎస్‌హెచ్‌జీ భవన నిర్మాణం, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులకు మార్కౌట్ ఇచ్చారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కరక్‌వాడి గ్రామపంచాయతీలో డ్రెయిన్ ఎండ్ సోక్‌పిట్, కమ్యూనిటీ సోక్‌పిట్ పనులను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు చేపడుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాంధారి గ్రామపంచాయతీలో ఎస్బీఎం కింద నిర్మిస్తున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అనంతరం డ్రెయిన్ ఎండ్ సోక్‌పిట్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఏపీఓ, టీఏలు, పీసీలు, ఎఫ్‌ఏలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












