సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. అక్టోబర్ నెలలో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి మొత్తం 55 మందిని అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించిన 38 సైబర్ క్రైమ్ కేసుల్లో దర్యాప్తు చేపట్టినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ అండ్ ఎస్ఐటీ) ఎం. శ్రీనివాసులు తెలిపారు.
అక్టోబర్‌లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 129 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అరెస్టయిన వారిలో మహారాష్ట్ర, తెలంగాణ నుంచి 16 మంది చొప్పున, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, గుజరాత్ నుంచి 7 మంది, ఢిల్లీ నుంచి 5 మంది, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి మరికొందరు ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వివిధ రకాల మోసాలు
నిందితులు ట్రేడింగ్ మోసాలు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా నేరాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ ఏపీకే ఫైళ్ల ద్వారా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.












