సత్తుపల్లి
ఖమ్మం జిల్లా మండలం బేతుపల్లి చెరువులో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. వరద నీటిలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ బృందంలోని 11 మంది గల్లంతవడంతో ఆందోళన నెలకొంది. అయితే రాత్రంతా కొనసాగిన గాలింపు చర్యల అనంతరం వారందరినీ అధికారులు సురక్షితంగా రక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా బేతుపల్లి చెరువులో నీటిమట్టం పెరిగి ప్రవాహం ఉద్ధృతంగా మారింది. ఈ సమయంలో చేపల వేట కోసం చెరువులోకి వెళ్లిన పలువురు మత్స్యకారులు వరద నీటిలో చిక్కుకున్నారు.












