కమలాపురం/ కడప జిల్లా (డాక్సిన్ టైమ్స్) జూలై 02
గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన నూతన మార్పులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన "విబి -జి రామ్) వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్" కార్యక్రమాన్ని ఆయన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డితో కలిసి వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రారంభించారు.
గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులు ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన "విబి -జి రామ్) వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్" కార్యక్రమాన్ని గురువారం వైఎస్ఆర్ కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గం, పెండ్లిమర్రి మండలం, తిప్పిరెడ్డిపల్లెలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి , కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని వరద కాలువలో పూడికతీత పనులను పలుగు పార పట్టి ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పనుల ద్వారా తిప్పిరెడ్డిపల్లెలో నిర్మించిన నూతన క్యాటిల్ షెడ్‌ను ప్రారంభించి అందులో స్థానిక రైతుకు చెందిన ఎద్దులకు వసతి కల్పించారు.












