మహీంద్రా స్కార్పియో ఎన్లో కొత్త ప్రత్యేక ఎడిషన్‌ను సంస్థ త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. స్కార్పియో ఎన్ ఎడిషన్ వన్ పేరుతో రూపొందించిన ఈ వాహనం, డీలర్షిప్ యార్డులో పరీక్షల సందర్భంగా కెమెరాలకు చిక్కింది.
ఇందులో కొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, డి పిల్లర్‌పై ప్రత్యేక ఎడిషన్ బ్యాడ్జింగ్, డార్క్ రెడ్బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను అందించనున్నారు. అధిక శ్రేణి వేరియంట్లో ఉండే క్లైమేట్ కంట్రోల్, రెండు డిజిటల్ స్క్రీన్లు, లెవల్ 2 ఏడీఏఎస్, వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి సదుపాయాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇంజిన్ పరంగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ఉన్న 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు కొనసాగనున్నాయి. ఆరు గేర్ల మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఈ వాహనం అందుబాటులో ఉండవచ్చు. సాధారణ వేరియంట్‌తో పోలిస్తే ఈ ప్రత్యేక ఎడిషన్ ధర సుమారు రూ.లక్ష వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. పండుగల సీజన్లో విడుదల చేయవచ్చని, పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించే అవకాశముందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











