దాదాపు 50 ఏళ్ల క్రితం తయారైన అరుదైన ఆపిల్-1 కంప్యూటర్ వేలంలో భారీ ధర పలికింది. పూర్తిగా పనిచేసే స్థితిలో ఉన్న ఈ యూనిట్ సుమారు రూ.10.9 కోట్లకు (11.48 లక్షల అమెరికన్ డాలర్లకు) అమ్ముడై రికార్డు సృష్టించింది. డాక్సిన్ టైమ్స్ లో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ సంతకం మదర్‌బోర్డుపై ఉండటం, స్టీవ్ జాబ్స్ స్వయంగా సంతకం చేసిన 1978 నాటి లేఖ కూడా దానితో పాటు లభించడం ఈ వేలానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కంప్యూటర్ను దాని అసలు యజమాని ఫ్రెడ్ హ్యాట్‌ఫీల్డ్ పేరు మీద హ్యాట్‌ఫీల్డ్ ఆపిల్-1 అని పిలుస్తారు. న బోన్హామ్స్ వేలం సంస్థ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఇద్దరు కొనుగోలుదారుల మధ్య సుమారు 28 నిమిషాల పాటు పోటీ కొనసాగిన తర్వాత ఈ ధర పలికింది. వాణిజ్యపరంగా విడుదలైన ఆపిల్-1 కంప్యూటర్లలో అత్యధిక ధరకు అమ్ముడైన యూనిట్‌గా ఇది రికార్డు సాధించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్టీవ్ జాబ్స్ లేఖలో ఏముంది
1978లో స్టీవ్ జాబ్స్ ఈ కంప్యూటర్ అసలు యజమాని ఫ్రెడ్ హ్యాట్ఫీల్డ్కు లేఖ రాశారు. ఆపిల్-1 కంప్యూటర్ను తిరిగి ఇచ్చి, దానికి బదులుగా కొత్త ఆపిల్-2 కంప్యూటర్ మదర్‌బోర్డును పొందే అవకాశం గురించి అందులో వివరించారు. ఆపిల్-1లో సాఫ్ట్వేర్ పరిమితంగా ఉందని హ్యాట్‌ఫీల్డ్ భావించడంతో, జాబ్స్ ఈ ప్రతిపాదన చేశారు. అయితే హ్యాట్‌ఫీల్డ్ ఆ మార్పిడికి అంగీకరించకుండా తన కంప్యూటర్ను తన వద్దే ఉంచుకున్నారు. ఆ నిర్ణయం ఈ రోజు ఆ అరుదైన కంప్యూటర్ చారిత్రక విలువను మరింత పెంచింది.












