తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో ఈ వివరాలను సంస్థ వెల్లడించింది. గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తుపాన్ కదిలింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతానికి అర్నబ్ తుపాన్ విశాఖపట్నానికి 540 కి.మీ, కాకినాడకు 620 కి.మీ, మచిలీపట్నానికి 720 కి.మీ, బాపట్లకు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.












