కామారెడ్డి, 29.07.2026
భారత వాతావరణ ాఖ హెచచరకల నేపథయంలో, కామారెడడ జలలాలో రాబోయే రోజులలో భారీ వరాలు, ఈదురుగాలులు, మెరుపులు సంభవంచే అవకాం ఉందన జలలా కలెకటర సంగవాన తెలపారు. పరజలు అపరమతతంగా ఉండాలన, అధకార యంతరాంగం జారీ చేసే సూచనలను తపపనసరగా పాటంచాలన యన కోరారు.
జిల్లాలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
"వర్షాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు, వాగులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు. వరద నీటిని దాటే ప్రయత్నం చేయడం ప్రమాదకరం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి" అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని, మెరుపులు పడే అవకాశం ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, రహదారులు జారుడు స్వభావం కలిగి ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కలుషితమైన ఆహారం, తాగునీటిని ఉపయోగించకుండా ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.









