చెన్నూరు, 13 September
వైఎస్ఆర్ జిల్లా మండలం శేషయ్యగారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు వెనుక టైరు కింద పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు టైరు కింద పడి ఇద్దరు యువకులు మృతి.. డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ . వైఎస్ఆర్ జిల్లా మండలం శేషయ్యగారిపల్లి వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక బస్సు వెనుక టైరు కింద పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కడప లోహియా నగర్‌కు చెందిన గంగవరం నరసింహులు (18), మాలికా మణి (15). వీరిద్దరూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. కానూరు మనోహర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మనోహర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు వెనుక టైరు కింద పడి ఇద్దరు మృతి చెందడంతో శేషయ్యగారిపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.











