ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ తన వ్యాపారాన్ని విస్తరిస్తూ, బెంగళూరుకు చెందిన షేర్డ్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ క్విక్ రైడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో మేక్మైట్రిప్ ఇకపై నగరాల్లో రోజువారీ ఆఫీస్ ప్రయాణాల విభాగంలోనూ అడుగుపెట్టనుంది.
విమానాలు, హోటళ్లు, బస్సులు, కార్ రెంటల్స్ వంటి సేవలపై ప్రధానంగా దృష్టి సారించిన మేక్మైట్రిప్, ఇప్పుడు రోజువారీ ఆఫీస్ ప్రయాణాల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ వ్యూహాత్మక అడుగు సంస్థ యొక్క ప్రయాణ సేవల పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరిస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొత్త సంస్థ ద్వారా కార్యకలాపాలు
క్విక్ రైడ్ బ్రాండ్, దాని కార్‌పూలింగ్ వ్యాపారాన్ని అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా కో రైడ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సంస్థలోకి మార్చారు. ఈ కొత్త సంస్థలో మేక్మైట్రిప్ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. అయితే, ఈ కొనుగోలు విలువ ఎంత ఖచ్చితంగా ఎంత శాతం వాటా తీసుకుంది అనే వివరాలను సంస్థ వెల్లడించలేదు.











