శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి పాల్గొని విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ, సృష్టికి మూలపురుషుడు, సృష్టి నిర్మాణకర్త అయిన విశ్వకర్మ భగవానుని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. తమ అద్భుతమైన నైపుణ్యం, చేతివృత్తులతో సమాజ నిర్మాణంలో కీలక భాగస్వాములవుతున్న శిల్పులు, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగి, శిల్ప కళాకారులు, విశ్వబ్రాహ్మణులు మరియు శ్రామిక సోదరులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చేతివృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది












