తమ స్థలంపై అసత్య ప్రచారాలు చేయడం తగదని, అలా చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని మట్లి సహకార సొసైటీ చైర్మన్ అప్పలనేని నాగరాజ నాయుడు హెచ్చరించారు. రాయచోటిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వీరబల్లి మండలం మట్లి పెద్దూరులో నంబా నాగభూషణం, నంబా నగేష్‌లకు చెందిన స్థలాన్ని తమ తండ్రి వెంకటసుబ్బయ్య 2002లో కొన్నారని, అప్పటి నుంచి ఆ స్థలం తమ ఆధీనంలోనే ఉందని నాగరాజ నాయుడు తెలిపారు. ఇటీవల అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో భాగంగా ఈ నెల 11న తన తమ్ముడు నాగార్జునకు రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చెత్త వేసుకుంటామని అడిగితే అనుమతించాం












