మాదిగ దళ పోరాట సమితి () రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కోర్ కమిటీ నియామకం జరిగింది. ఈ నియామకంలో భాగంగా, రాష్ట్ర కోర్ కమిటీ ఉపాధ్యక్షులుగా సుండుపల్లి రవి నియమితులయ్యారు. వ్యవస్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పెద్దపల్లి శేఖర్ సమక్షంలో ఈ నియామకాలు జరిగాయి.
పట్టణంలోని బాబు జగజీవన్ రామ్ భవన్లో మాదిగ దళ పోరాట సమితి () జిల్లా నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నాయకుల ఆహ్వానం మేరకు పట్టణానికి విచ్చేసిన వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ గారికి, నలుమూలల నుండి వచ్చిన మాదిగలు మరియు జిల్లా మాదిగ దళ పోరాట సమితి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోర్ కమిటీ నియామకం












