దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఆనందం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రేమ, ఆప్యాయత, సోదరభావం, సామరస్యాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు వినియోగించాలని సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.












