మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 24,600 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ, పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదానికి బానిసై కుటుంబాలను రోడ్డున పడేయవద్దని, యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రాజు తెలిపారు.












