కామారెడ్డి, 14 September
శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న డీజేను దేవునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాబ్దిపూర్ తండాలో అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శబ్ద కాలుష్యానికి కారణమైన డీజే సీజ్ కామారెడ్డి : శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజేను దేవునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని, నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాబ్దిపూర్ తండాలో సోమవారం ఒక వ్యక్తి డీజేను అధిక శబ్దంతో ఆపరేట్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమతులు లేకుండా డీజే నిర్వహిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.












