కామారెడ్డి, 14 September
వజ్జేపల్లి గ్రామంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, డీజే యజమాని, ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి, వాహనాన్ని, సామగ్రిని సీజ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డీజే నిషేధ నిబంధనల ఉల్లంఘనపై కేసు – డీజే వాహనం సామగ్రి సీజ్. వజ్జేపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా డీజే నిర్వహణ నిర్వాహకులు, డీజే యజమాని, ఆపరేటర్‌పై కేసు నమోదు సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజ్ . జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజ్జేపల్లి గ్రామంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజే నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. డీజే నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీస్ శాఖ సూచనలు మరియు నిబంధనలను ఇప్పటికే స్పష్టంగా తెలియజేసినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ ధగడ్ యూత్ ఆధ్వర్యంలో డీజే నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సంబంధిత నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.అదేవిధంగా డీజే యజమాని మరియు ఆపరేటర్‌పై కూడా కేసు నమోదు చేసి, డీజేకు సంబంధించిన వాహనం మరియు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మరియు పోలీస్ శాఖ సూచనలకు విరుద్ధంగా డీజేలు నిర్వహిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపారు .ప్రజల శాంతి, భద్రత మరియు ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు డీజే నిషేధ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. శాంతియుత వాతావరణం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి. సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజ్ కోరారు












