రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో మరో ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు గంజాయి తరలిస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జాతీయ రహదారి-44పై తనిఖీలు చేపట్టారు. క్యాసంపల్లి శివారులోని రాయల్ ధాబా సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాన్ని తనిఖీ చేయగా, వాహనం పైభాగంలో పనసపండ్లు ఉంచి, వాటి కింద సంచుల్లో గంజాయిని దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాహనం స్వాధీనం, గంజాయి సీజ్












