బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో నూడుల్స్‌లో కారం ఎక్కువగా ఉందని కారణంతో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అస్సాంకు చెందిన ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపైనా దాడి చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి దొడ్డతోగూరులోని ఓ ఫాస్ట్‌ఫుడ్ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్న కొందరు వ్యక్తులు తాము ఆర్డర్ చేసిన నూడుల్స్‌లో కారం ఎక్కువగా ఉందని దుకాణం సిబ్బందిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఘర్షణ తీవ్రత
వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. నిందితులు కార్మికులను కిందపడేసి పిడిగుద్దులతో పాటు కాళ్లతో కొట్టినట్లు పోలీసు అధికారి తెలిపారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కూడా దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చాయి.












