అమెరికాలో 17 నెలల క్రితం అదృశ్యమైన ఉటా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఒరెగాన్‌లో సురక్షితంగా లభించింది. 2020లో గార్డెన్ సిటీలో కనిపించకుండా పోయిన బాలిక కోసం ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు ఏడాదిన్నరగా గాలిస్తున్నారు. ఒరెగాన్లోని హంటింగ్టన్లో ఓ వ్యక్తి ఇంట్లో ఆమె ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి బాలికను రక్షించారు.
అమెరికాలో 17 నెలల క్రితం అదృశ్యమైన ఉటా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఒరెగాన్‌లో సురక్షితంగా లభించింది. 2020లో గార్డెన్ సిటీలో కనిపించకుండా పోయిన బాలిక కోసం ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు ఏడాదిన్నరగా గాలిస్తున్నారు. ఒరెగాన్లోని హంటింగ్టన్లో ఓ వ్యక్తి ఇంట్లో ఆమె ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి బాలికను రక్షించారు. ఈ కేసులో 39 ఏళ్ల ఆడమ్ హంటర్ హార్మెల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా బాలికకు పరిచయమైన నిందితుడు ఆమెను ఉటా నుంచి ఒరెగాన్కు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తనను ఇంట్లో బంధించి, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడని, శారీరకంగా, లైంగికంగా వేధించాడని బాలిక అధికారులకు తెలిపింది. ఆమెను గుర్తించకుండా ఉండేందుకు పళ్లకు ఉన్న బ్రేస్‌లను శ్రావణంతో తొలగించాడని కూడా ఆరోపించింది. బాలికను రక్షించినట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది. రాష్ట్రాల మధ్య బాలికను తరలించి, లైంగిక నేరానికి పాల్పడేందుకు ప్రయత్నించినట్లు నిందితుడిపై ఫెడరల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





