సందర్భంగా (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 14
వినాయక చవితి రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కామారెడ్డి పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆలోచనతో, ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా మార్చి, హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వినాయకుడికి హెల్మెట్‌తో రోడ్డు భద్రత సందేశం : వినాయక చవితి రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కామారెడ్డి పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆలోచనకు అనుగుణంగా పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను వినాయక మండపంగా తీర్చిదిద్దారు. హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి “హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి” అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఈ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మండపాన్ని సందర్శించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, మతసామరస్యంతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. హెల్మెట్ కేవలం నిబంధన కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని ఎస్పీ పేర్కొన్నారు. పండుగ సమయంలో ప్రజలు అధికంగా రోడ్లపైకి వచ్చే నేపథ్యంలో వేగ నియంత్రణ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. పట్టణంలోని వివిధ వినాయక మండపాల వద్ద కూడా రహదారి భద్రతపై అవగాహన కల్పించే సందేశాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, డీఎస్పీ ఎస్. మధుసూదన్, పట్టణ ఎస్హెచ్ఓ బి. నరహరి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.












