హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ కే వెంకటరామిరెడ్డిపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని, అక్రమ నిర్బంధానికి గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినందుకు జర్నలిస్ట్ కే వెంకటరామిరెడ్డిపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం, సీఐ విక్రమ్ సింహ ఆయనకు నోటీసులు ఇచ్చి స్టేషన్‌కు పిలిపించినట్లు సమాచారం. అయితే, వెంకటరామిరెడ్డి ఆచూకీ లభించకపోవడంతో, కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని కుటుంబ సభ్యులకు ఫోన్ల ద్వారా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపణలున్నాయి. ఈ సంఘటన జర్నలిస్టుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.











