బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు రూ.5 కోట్ల ఎక్స్టార్షన్ బెదిరింపు రావడం ముంబైలో కలకలం రేపింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తినని చెప్పుకున్న ఓ వ్యక్తి ఫోన్ చేసి, భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఫోన్ చేసిన వ్యక్తి తనను హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్నాడు. రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరిస్తూ ఆడియో సందేశం పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తుషార్ కపూర్ ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసు దర్యాప్తును యాంటీ ఎక్స్టార్షన్ సెల్, క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దర్యాప్తు వివరాలు
దర్యాప్తులో భాగంగా క్రైమ్ బ్రాంచ్ సాంకేతిక బృందం బెదిరింపు ఆడియోను పరిశీలించింది. అందులోని గొంతును పోలీసుల డేటాబేస్‌లో ఉన్న హ్యారీ బాక్సర్ అధికారిక వాయిస్ శాంపిల్స్‌తో పోల్చింది. అయితే రెండు గొంతుల మధ్య పోలిక లేదని ప్రాథమిక విశ్లేషణలో తేలినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.












