పొరుగువారిని తప్పుడు హత్యాయత్నం కేసులో ఇరికించేందుకు సొంత ఇంటి వద్దే కాల్పులు జరిపించుకున్న ఘటనలో గ్రేటర్ నోయిడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పాత వివాదంతో ప్రతీకారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఫిర్యాదుదారుడు, అతని సోదరుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా దాద్రి ప్రాంతంలో పొరుగువారిని తప్పుడు హత్యాయత్నం కేసులో ఇరికించేందుకు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. తనపై తానే కాల్పులు జరిపించుకుని, ఆ నేరాన్ని పొరుగువారిపై నెట్టేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ కుట్రలో భాగస్వాములైన ముగ్గురిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల వివరాల ప్రకారం.. హరేంద్ర అనే వ్యక్తి దాద్రి పోలీసులను ఆశ్రయించాడు. తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారని, తాను తృటిలో తప్పించుకున్నానని ఫిర్యాదు చేశాడు. తన పొరుగువాడైన వికాస్ ఈ ఘటన వెనుక ఉన్నాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు వికాస్‌తో పాటు గుర్తుతెలియని వ్యక్తులపై హత్యాయత్నం, బెదిరింపులు తదితర అభియోగాలతో కేసు నమోదు చేశారు.












