తిరుపతి, జూన్ 25
తిరుమల యాత్ర ముగించుకుని బెంగళూరుకు వెళ్తున్న కుటుంబం, హోటల్లో సుమారు రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌ను మరిచిపోయింది. డయల్-112కు సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, హోటల్ క్యాషియర్ శశి సహాయంతో ఆ బ్యాగ్‌ను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తిరుమలలో కుటుంబ వివాహ కార్యక్రమం ముగించుకుని బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతున్న ఓ కుటుంబం, మార్గమధ్యలో అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్లో భోజనం చేసింది. ఈ క్రమంలో సుమారు రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయి వెళ్లిపోయారు.












