కడప జిల్లా మండలంలోని ప్రసిద్ధ హత్యారాల పుణ్యక్షేత్రంలో శనివారం చరిత్ర సృష్టించేలా గంగా హారతి, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. దాదాపు రెండు వేలకు పైగా భక్తులు హాజరైన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.
ఆలయ ప్రాంగణంలో దీపాల వెలుగులు, మంత్రోచ్ఛారణలు, భక్తి గీతాల నడుమ గంగా హారతిని నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో హారతి ఇవ్వగా భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. కొండ చుట్టూ భక్తులు భజనలు చేసుకుంటూ ప్రదక్షిణ చేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.











