జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
టీటీడీ వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పుష్ప మాలికలు, విలువైన ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ కల్యాణ ఘట్టం వైభవంగా సాగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రామయ్య కల్యాణాన్ని భక్తులు తన్మయత్వంతో తిలకించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.











