తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీర్ఘకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 13 మంది పోటు వర్కర్ సీనియర్లకు పోటు సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించింది.
సింహ వాహనసేవ అనంతరం బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి పదోన్నతి ఉత్తర్వులను వారికి అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గత కొన్ని సంవత్సరాలుగా పోటు వర్కర్ సీనియర్లుగా విధులు నిర్వహిస్తున్న 13 మందికి పదోన్నతులు కల్పించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పాలకమండలిలో (తీర్మానం నెం. 576, తేది 16.12.2025) తీర్మానం చేశారు. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది.












