రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను పాటించకుండా నగరంలో ఇష్టారాజ్యంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరమ్ () రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బృందం కలెక్టర్ కార్యాలయంలో మల్లికార్జునుడుకు వినతిపత్రం అందజేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 21 వరకు పాఠశాలలకు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని విద్యాసంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయని రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు యాదవ్ తెలిపారు. నారాయణ, చైతన్య, గురుకుల్ విద్యాపీఠ్, స్కూల్, వికాస్, భాష్యం వంటి విద్యాసంస్థలు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేల్ వంటి ప్రాంతాలలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు












