వేంపల్లి (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 15
కడప జిల్లా మండలంలో అక్రమ ఇసుక తవ్వకాలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ వద్ద టిప్పర్లను అడ్డుకుని ధర్నా చేపట్టారు. ఇసుక తవ్వకాల వల్ల తమ పొలాల్లోని బోర్లు ఎండిపోతున్నాయని, పంటలు నష్టపోతున్నామని రైతులు వాపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అక్రమ ఇసుక తోడకం పై రీచ్ వద్ద రైతుల ఆగ్రహం! పొలాల్లో బోర్లు ఎండిపోతున్నాయంటూ ఆందోళన — టిప్పర్లు అడ్డుకుని రైతుల ధర్నా — డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ దక్షిణ్ టైమ్స్ . కడప జిల్లా, మండలంలోని ఇసుక రీచ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఇసుక తవ్వకాల కారణంగా తమ పొలాల్లోని బోర్లలో నీటి లభ్యత తగ్గిపోయి, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇసుక రీచ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టిప్పర్లను అడ్డుకుని ధర్నా చేపట్టారు. తమకు అనుమతించిన మేరకు సుమారు మూడు అడుగుల లోతు వరకు మాత్రమే తవ్వాల్సి ఉండగా.. దాదాపు 10 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, సాగునీటి సమస్య తీవ్రంగా మారుతోందని వాపోయారు. ధర్నా సందర్భంగా అక్కడికి వచ్చిన పులివెందుల టీడీపీ కార్యకర్త శివారెడ్డి రైతులను భయభ్రాంతులకు గురిచేశారని రైతులు ఆరోపించారు. తమ పంటలను కాపాడుకునేందుకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “మా భార్యల తాళిబొట్లు పెట్టి పంటలు సాగు చేస్తున్నాం.. మీరు ఇలాగే చేస్తే మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది” అంటూ శివారెడ్డిని రైతులు నిలదీశారు. ధర్నాను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రైతులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇసుక రీచ్‌ను వెంటనే నిలిపివేసి తమ పంట పొలాలను, భూగర్భ జలాలను కాపాడాలని కోరుతూ రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతుల ఫిర్యాదుపై అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.











