కామారెడ్డి, 2026-10-06
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించే లక్ష్యంతో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి-44 వెంట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు రెస్టారెంట్లలో తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించి, ఆరు సంస్థల ఆహార లైసెన్సులను సస్పెండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి-44 వెంట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. టీజీ సేఫ్‌కు చెందిన 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 20 ఆహార సంస్థలను తనిఖీ చేశాయి. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి-44 వెంట 8 రెస్టారెంట్లను తనిఖీ చేశారు.












