రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న అంగల్లు గ్రామానికి చెందిన చిన్నారి కీర్తనకు అవసరమైన రూ. 6 లక్షల విలువైన కోక్లియర్ ఇంప్లాంట్ వినికిడి యంత్రాన్ని అందజేసి ఆదుకున్నారు. ఈ సహాయంతో చిన్నారి త్వరలోనే వినికిడి శక్తిని పొందే అవకాశం ఉంది.
మండలం, అంగల్లు గ్రామానికి చెందిన కీర్తన పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతోంది. చిన్నారికి కోక్లియర్ ఇంప్లాంట్ చికిత్స చేయిస్తేనే వినికిడి తిరిగి వస్తుందని వైద్యులు సూచించారు. అయితే, దీని ఖరీదు సుమారు రూ. 6 లక్షలు కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన కీర్తన తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విషయం రాజంపేట పార్లమెంట్ సభ్యులు, ఎంపీ శ్రీ పి.వి. మిథున్ రెడ్డి దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఎంపీ, చిన్నారి చికిత్సకు అవసరమైన రూ. 6 లక్షల విలువైన కోక్లియర్ ఇంప్లాంట్ వినికిడి యంత్రాన్ని అందజేశారు.












