తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి జన్మదినం సందర్భంగా, మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
ఆపదలో ఉన్నవారికి రక్తదానం ద్వారా ప్రాణదానం చేయవచ్చనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా, అత్యవసర సమయంలో అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ రక్తదాన శిబిరంలో జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోర్త రాజేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.












